ఫినిషింగ్ కింగ్.. దిగ్గజాలే సలాం కొట్టే రేంజ్‌ ధోనీది

by Dishafeatures2 |
ఫినిషింగ్ కింగ్.. దిగ్గజాలే సలాం కొట్టే రేంజ్‌ ధోనీది
X

దిశ, వెబ్‌డెస్క్: కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తెలియని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న అతి గొప్ప క్రికెట్ ప్లేయర్స్‌లో ధోనీ పేరు ప్రతి ఫార్మాట్‌లో ఉంటుంది. ధోనీ ఆటతీరుకు, కూల్ మైండ్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్స్‌లో ధోనీ ఒకడు. సచిన్, కోహ్లీల మాదిరిగా మహేంద్ర సింగ్ ధోనీ పేరు మీద బోలెడన్ని బ్యాటింగ్ రికార్డులు లేవు. వారిలా అతను టన్నుల కొద్దీ పరుగులు కూడా చేయలేదు. కానీ గంగి గోవు పాలు గరిటడైనా చాలు అన్నట్టుగా ధోనీ చేసిన రన్స్ తక్కువే అయినా మ్యాచ్ ఫలితం పైన వాటి ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్‌లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో అతని ప్రతిభ అద్వితీయం. తన సుదీర్ఘమైన కెరీర్‌లో ధోనీ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు. ధోనీ ఆటతీరును మెచ్చి దిగ్గజ క్రికెటర్లే సలాం కొట్టే రేంజ్‌కు ఎదిగాడు. ఈ క్రమంలో జట్టుకు అనేక అద్భుత విజయాలు అందించి, భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ సాధించనన్ని ట్రోఫీలు సాధించాడు.

అయితే, ఈరోజు కెప్టెన్ కూల్ ధోనీ తన 41వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. ధోనీ తన బర్త్‌డేను భార్య సాక్షి, స్నేహితులతో కలిసి యూకేలో ఘనంగా జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ చూసిన హ్యాపీ బర్త్ డే మహి అన్న హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ధోనీ భార్య సాక్షి రాత్రి అభిమానులతో షేర్ చేసుకున్నారు.


యోగా దేవత'.. మలైకా ఫిట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!


హరీష్ శంకర్‌కు హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ సినిమా లేనట్లే!




Next Story

Most Viewed