అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

by Batti.Sumithra |

ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్
X

దిశ, మంచిర్యాల : ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. మంగళవారం బెల్లంపల్లి, నెన్నెల, కన్నెపెల్లి మండలాలలో పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. బెల్లంపల్లి పట్టణంలో రాంనగర్ ప్రాథమిక పాఠశాల, మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో భోజనశాల, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పవన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. కన్నెపెల్లి, నెన్నెల కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. విద్యార్థుల సంక్షేమం దృష్టిలో ఉంచి ప్రభుత్వం పాఠశాలల్లో వసతులను కల్పిస్తుంది అన్నారు. త్వరితగతిన భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story