అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి.. కలెక్టర్

by Batti.Sumithra |

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అధికారులకు సూచించారు.

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి.. కలెక్టర్
X

దిశ, హాలియా : ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. మంగళవారం హాలియాలో నూతనంగా నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రిని పరిశీలించి నెల రోజుల్లో ఆసుపత్రి ప్రారంభానికి కావలసిన పనులను పూర్తిచేయాలని జిల్లా అధికారి మాతృ నాయక్ ను ఆదేశించారు. ఆస్పత్రిలో నూతన ఎక్విప్ మెంట్ కు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తద్వారా నిధులను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.

సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. హాలియా మున్సిపాలిటీలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు రూ.15 కోట్ల రూపాయల ఖర్చుతో అమృత్ స్కీం ( పబ్లిక్ హెల్త్ ) ద్వారా నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకులను పరిశీలించి పనుల వేగవంతానికి కావలసిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా నిర్మాణ పనులు ఆగిపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ ను పిలిచి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆయన వెంట డిసిహెచ్ మాతృనాయక్ మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రాజా రమేష్, కమిషనర్ రవీందర్ రెడ్డి, మండల వైద్యాధికారి రామకృష్ణ, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు ఉన్నారు.

Next Story