ఇంటికి అవసరమైన విద్యుత్ అందించే 'విండ్ టర్బైన్ వాల్'!

by Disha Web |
ఇంటికి అవసరమైన విద్యుత్ అందించే విండ్ టర్బైన్ వాల్!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా తీరప్రాంతాలు, కొండ శిఖరాలు, బహిరంగ మైదానాలు లేదా గాలి బలంగా వీచే ఇతర ప్రదేశాల్లో జెయింట్ టర్బయిన్స్ ప్లేస్ చేస్తారు. కానీ ఇంటి పక్కనే పెద్ద టర్బయిన్‌ ఉంచాలి, దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఎవరైనా ఆలోచిస్తారా? లేదు కదా. కానీ న్యూయార్క్ ఆధారిత డిజైనర్ జో డౌసెట్ అదే చేశాడు. చూసేందుకు గోడల కనిపించే 'విండ్ టర్బయిన్ వాల్' నుంచి ఇంటికి సరిపోయే కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాడు.

కాగా ఈ తేలికైన డిజైన్ కలిగిన టర్బయిన్‌ను ఏర్పాటు చేసేందుకు 8 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు గల గోడ ఉంటే సరిపోతుంది. ఈ పునరుత్పాదక శక్తి వనరు నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్ సంవత్సరానికి 10,000 KwH గా అంచనా వేయగా, ఇది నాలుగు భారతీయ గృహాలకు సరిపోయే విద్యుత్‌తో సమానం (సగటున, ఒక భారతీయ పట్టణ గృహం నెలకు 150 - 200 KwH మధ్య వినియోగిస్తుంది). ఇక ఈ పరికరం లండన్ డిజైన్ మ్యూజియం, బినాలే ఇంటర్నేషనల్ డిజైన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమైంది. వరల్డ్ టెక్నాలజీ అవార్డుతో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులు, మల్టిపుల్ డిజైన్ అవార్డ్స్ అందుకున్నాడు జో డౌసెట్.

శక్తిని ఉత్పత్తి చేసేందుకు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయ గ్రిడ్‌లకు సహాయం చేసేందుకు పవన శక్తి కీలక పాత్ర పోషించింది. అయితే ఇంటి కోసం తయారు చేసిన విండ్ టర్బైన్స్ కూడా బెస్ట్ సర్వీస్‌ అందించనుంది. ఈ 'కైనటిక్ వాల్' రోటరీ బ్లేడ్ సిరీస్‌తో రూపొందించాను. ఈ బ్లేడ్స్ ఒక్కొక్కటిగా తిరుగుతూ శక్తి ఉత్పన్నం చేస్తాయి. ఈ శక్తి గోడకు అమర్చిన బ్యాటరీలో నిల్వ చేయబడుతుంది లేదా యజమానికి ఆదాయాన్ని అందించేందుకు జాతీయ గ్రిడ్‌కు తిరిగి అందించబడుతుంది. ఇది విద్యుత్‌ను సృష్టించే మినీ జనరేటర్‌ను కూడా నడపగలదు. అందువల్ల గృహస్థులే కాదు వ్యాపారులు కూడా దీన్ని వాడుకోవచ్చు.

Next Story

Most Viewed