మహారాష్ట్రలో ప్రజాస్వామ్యంపై అక్రమదాడి

by Disha Web |
మహారాష్ట్రలో ప్రజాస్వామ్యంపై అక్రమదాడి
X

కోల్‌కతా: మహారాష్ట్రలో ప్రభుత్వం సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని చూస్తున్నారని గురువారం విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం సరిగ్గా ఉందా అనే సందేహం నాలో ఉంది. ప్రజాస్వామ్యం ఎక్కుడుంది. వారు ప్రభుత్వాన్ని అణచివేయాలని చూస్తున్నారు. మేము ప్రజలకు, ఉద్ధవ్ ఠాక్రేకు న్యాయం కావాలని కోరుతున్నాం. మహారాష్ట్ర తర్వాత మరో ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూస్తున్నారు' అని అన్నారు. హవాలా డబ్బులను ఉపయోగించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మెజార్టీ కోసమే బీజేపీ ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఇది అనైతికమని, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. తమ నేతలపై కేంద్ర సంస్థలను ప్రయోగించిన, ఇప్పటివరకు ఏం నిరూపించారని బీజేపీని ప్రశ్నించారు. అధికారం కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మోసం కాదా అని ప్రశ్నించారు. మరోవైపు త్రిపురలో జరుగుతున్న ఉపఎన్నికలను ప్రస్తావిస్తూ.. ప్రజలు ఓటు వేయలేకపోతున్నారని అన్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒకలా, లేని రాష్ట్రంలో మరొలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

Next Story