- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హైటెక్స్‌లో దీప్‌మేళా షాపింగ్

దిశ, శేరిలింగంపల్లి: అనాథలకు అండగా నిలిస్తున్న దీపిక్షా మహిళా క్లబ్ గత కొన్ని సంవత్సరాలుగా కన్య గురుకల పాఠశాలను దత్తత తీసుకుంది. ఇందుకోసం ప్రతి యేటా దీప్ మేళా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ మేళాలో వచ్చిన నిధులను దత్తత పాఠశాల కోసం ఖర్చు చేస్తుందీ సంస్థ. అలాగే ఈసారి కూడా హైటెక్స్‌లో రెండు రోజులపాటు దీప్ మేళా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ మేళాలో గృహిణులను ప్రోత్సహించడానికి గాను కళాత్మక వస్తువులు, అల్లిన దుస్తులు, కుట్టిన వస్తువులు, ఎంబ్రాయిడరీ వస్తువులు, పాపడ్, ఊరగాయలు, వడలు వంటి ఇంట్లో తయారు చేసిన వస్తువులు ప్రదర్శనలో కొలువుదీరాయి. అలాగే కన్స్యూమర్ అండ్ కార్నివాల్స్ పరిశ్రమలో దుస్తులు, ఆభరణాలు, ఉపకరణాలు, గృహోపకరణాలు, డెకర్ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, సౌందర్య ఉత్పత్తులు, ఆహారం, పానీయాలు, హ్యాండ్ బ్యాగ్‌లు మొదలైన ఇతర ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు సందర్శకులు ఉత్సాహం చూపుతున్నారు.