డి-ప్రింటింగ్ మిషీన్‌.. పేప‌ర్‌పైన‌ రంగును మింగి, ఇలా చేస్తుంది!! (వీడియో)

by Disha Web Desk 20 |
డి-ప్రింటింగ్ మిషీన్‌.. పేప‌ర్‌పైన‌ రంగును మింగి, ఇలా చేస్తుంది!! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మాన‌వుడు డిజిట‌ల్ ప్ర‌పంచంలో జీవిస్తున్న‌ప్ప‌టికీ కొన్ని విష‌యాల్లో భౌతిక వ‌స్తువుల‌పై ఆధార‌ప‌డ‌క త‌ప్ప‌ట్లేదు. ఒక విధంగా త‌ప్ప‌దు కూడా. కార‌ణాలు ఏవైనా కాగితం లేని ప్ర‌పంచాన్ని మ‌నిషి ఇప్పుడిప్పుడే ఊహించుకోవ‌డం క‌ష్టం. అయితే, ముఖ్యంగా ఆఫీసు కార్య‌క‌లాపాల్లో అత్య‌వ‌స‌ర‌మైన కాగితం త‌యారీ రోజు రోజుకూ క‌ష్టాల‌ను ఎదుర్కుంటోంది. డిమాండుకు త‌గినంత పేప‌ర్ త‌యారీ అంశం ప‌క్క‌న ఉంచితే, వాటిని త‌యారుచేయ‌డానికి చెట్ల‌ను న‌రికేయాల్సి వ‌స్తుంది. అది ప‌ర్యావ‌ర‌ణానికి తీవ్ర‌మైన హాని చేస్తోంది. అందుకే, ప్రింట్ చేసిన‌ పేపర్‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ ప్రింట్ చేసుకునే విధంగా శాస్త్ర‌వేత్త‌లు ఒక డి-ప్రింటింగ్ మిషీన్‌ను త‌యారుచేశారు. ఈ డి-ప్రింట‌ర్ కాగితంపైన ప్రింట్ అయిన‌ ఇంక్‌ను తీసివేసి, ఒక్కో షీట్‌ను పదిసార్లు మళ్లీ ఉపయోగించుకునేలా మార్చుతుంది. ఇలా ఆఫీస్ పేపర్‌కి డిమాండ్‌ని తగ్గించడం ద్వారా, కాగితం, దాని ముడి ప‌దార్థ‌మైన‌ పల్ప్ సెక్టార్ నుండి ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించే కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాల పరిమాణాన్ని తగ్గించాలని శాస్త్ర‌వేత్త‌లు కోరుతున్నారు.

ఈ సర్క్యులర్ ప్రింటింగ్ గురించి ఇజ్రాయెల్‌లోని REEP టెక్నాలజీస్‌కు చెందిన చీఫ్‌ డెవలపర్ బరాక్ యెకుటీలీ వివరించారు. "REEP పద్ధతి, అత్యాధునిక లేజర్ టెక్నాలజీని ఉపయోగించి కాగితం నుండి సిరా మొత్తాన్ని పూర్తిగా తొలగిస్తుంది." డి-ప్రింటింగ్ అత్యాధునిక మెటీరియల్‌తో కాగితాన్ని తిరిగి ఉపయోగించ‌డానికి స‌హ‌క‌రిస్తుంది. ఇక‌, ఇంగెడే అనే ప్రసిద్ధ డీంకింగ్ పరీక్షలో ఖచ్చితమైన స్కోర్‌తో ఉత్తీర్ణత సాధించిన మొదటి డి-ప్రింటింగ్ టెక్నిక్ ఇదే కావ‌డం విశేషం.


Next Story

Most Viewed