మేలో రూ. 1.13 లక్షల కోట్లకు పెరిగిన క్రెడిట్ కార్డుల వ్యయం!

by Dishafeatures2 |
మేలో రూ. 1.13 లక్షల కోట్లకు పెరిగిన క్రెడిట్ కార్డుల వ్యయం!
X

ముంబై: ప్రస్తుత ఏడాది దేశీయంగా ఏప్రిల్‌లో రూ. 1.05 లక్షల కోట్లతో పోలిస్తే మే నెలలో క్రెడిట్ కార్డుల వ్యయం రూ. 1.13 లక్షల కోలకు పెరిగాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గణాంకాలు పేర్కొన్నాయి. కార్డుల ఖర్చు పెరగడాన్ని బట్టి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని గణాంకాలు తెలిపాయి. ఇందులో మొత్తం 7.68 కోట్ల మంది క్రెడిట్ కార్డు హోల్డర్లు ఆన్‌లైన్ ద్వారా సుమారు రూ. 71,429 కోట్లు, పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మెషీన్‌లలో స్వైపిగ్ ద్వారా రూ. 42,266 కోట్లను ఖర్చు చేశారు. లావాదేవీల పరంగా క్రెడిట్ కార్డుల చెల్లింపులు 12.2 కోట్ల ఆఫ్‌లైన్ లావాదేవీలు జరగ్గా, ఆన్‌లైన్ లావాదేవీలు 11.5 కోట్లకు స్వల్పంగా తగ్గాయి. క్రెడిట్ కార్డు హోల్డర్లు ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేందుకు రూ. 65,652 కోట్లు వెచ్చించారని ఆర్‌బీఐ గణాంకాలు పేర్కొన్నాయి.

కార్డు హోల్డర్లు ఆఫ్‌లైన్ విధానంలో కంటే సగటున ఆన్‌లైన్‌లో ఎక్కువ లావాదేవీలు నిర్వహిస్తున్నారని గణాంకాలు తెలిపాయి. డెబిట్ కార్డులకు సంబంధించి సమీక్షించిన నెలలో ఆన్‌లైన్ ద్వారా రూ. 65,957 కోట్లు ఖర్చు చేయగా, ఈ-కామర్స్ ఖర్చులు రూ. 21,104 కోట్లు, పీఓఎస్ ద్వారా రూ. 44,305 కోట్లు ఖర్చు చేశారు. మే నెలలో కొత్తగా 20 లక్షల క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఏప్రిల్‌లో ఉన్న కార్డుల సంఖ్య 7.51 కోట్లు ఉండగా, అత్యధికంగా 1.72 కోట్ల కార్డులతో ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కలిగి ఉంది.


Next Story