రోడ్డున పడనున్న ఆ అధ్యాపకులు.. ప్రశ్నార్థకంగా మారిన భవితవ్యం

by Disha Web Desk 2 |
రోడ్డున పడనున్న ఆ అధ్యాపకులు.. ప్రశ్నార్థకంగా మారిన భవితవ్యం
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలను ఎంట్రెన్స్, మౌఖిక పరీక్షల ద్వా రా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉండ డంతో పాలమూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒప్పం ద అధ్యాపకులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సుదీర్ఘకాలంపాటు సేవలందించిన తమను రెగ్యులర్ చేయ కుండా ప్రభుత్వం రెగ్యులర్ బోధన, బోధనేతర సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవడం సరైన విధానం కా దని, తమకు న్యాయం చేసిన తర్వాతే మిగతా ఖాళీలను మీ రు నిర్ణయించుకున్న విధానం ద్వారా భర్తీ చేయాలని ఒప్పం ద అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు.

2008 నుంచి..

పాలమూరు విశ్వవిద్యాలయం 2008లో ఆరంభమైంది. ఆ సమయంలో 8మంది రెగ్యులర్, 50 మంది ఒప్పంద అధ్యాపకులతో యూనివర్సిటీ ఆరంభమయింది. దశలవారీగా అ భివృద్ధి చెందుతున్న ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం 26 మం ది రెగ్యులర్, 116 మంది ఒప్పంద అధ్యాపకులు పని చేస్తు న్నారు. 14 సంవత్సరాలుగా తమ ఉద్యోగాలు తప్పనిసరిగా రెగ్యులరైజేషన్ అవుతాయన్న నమ్మకంతో ఒప్పంద అధ్యాపకులు పనిచేస్తూ వస్తున్నారు. డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులందర్నీ రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో తమ విషయంలో నూ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ వచ్చారు. గతంలో యూనివర్సిటీలే స్వయంగా బోధన, బోధనేతర సిబ్బందిని విద్యార్హత ఆధారంగా నియమించేవారు. ప్రస్తుతం ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 16 వల్లఎన్నికల ప్రక్రియ ప్రభుత్వం చేతిలోకి వెళ్లింది. దీనివల్ల నియామకాల ప్రక్రియ పూర్తయితే రెగ్యులర్ అధ్యాపకులు విధుల్లో చేరితే ప్రస్తుతం పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు అందరూ రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

76 పోస్టులు ఖాళీ..

పాలమూరు విశ్వవిద్యాలయంలో 76 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీ ఆరంభం అయినప్పటి నుం చి ఒప్పంద అధ్యాపకులతో విద్యాబోధన చేస్తూ నడుపుతూ వచ్చారు. యూనివర్సిటీలో ప్రస్తుతము 16 కోర్సులలో.. 2వేల మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. కానీ వీరికి విద్యాబోధన చేయాల్సిన 13 మంది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. 24 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గానూ కేవలం ముగ్గురే ఉండగా.. ఇరవై ఒక్క ఖాళీలు ఉన్నాయి. 58 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గానూ కేవలం 16 మంది రెగ్యులర్ ఉద్యోగులు పని చేస్తుండగా 42 ఖాళీలు ఉన్నాయి. ఒప్పంద అధ్యాపకులతో విద్యాబోధన చేస్తూ వస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో నియామకాలు జరగలేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడం కారణంగా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ప్రక్రి య ఆశించిన మేర జరగలేదు. ఒప్పంద అధ్యాపకుల సహకారంతోనే పాఠ్యాంశాలు బోధిస్తూ వచ్చారు. 14 సంవత్సరాలుగా ఒప్పంద అధ్యాపకులు అవసరాల మేరకు విధులు నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతము రెగ్యులర్ నియామకాలు చేపట్టడం, ప్రభుత్వం తమను రెగ్యులర్ చేసేందుకు చర్యలు తీసుకోకపోవడం వల్ల తమ పరిస్థితి ఏంటని ఒప్పంద అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు.

మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలి

యూనివర్సిటీ ఆరంభమైనప్పటి నుంచి పని చేస్తున్నాం. కొ న్నిసార్లు సిబ్బంది తక్కువగా ఉన్న అన్ని రకాల బాధ్యతలు ని ర్వహిస్తూ వచ్చాం. ఇప్పుడు రెగ్యులర్ బోధన సిబ్బందిని నియమిస్తే మా పరిస్థితి ఏంటి..? డిగ్రీ, ఇంటర్ ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేసినట్లే మమ్మల్ని కూడా చేయాలి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొని న్యాయం చేకూర్చాలి. - భూమయ్య, సంఘం అధ్యక్షుడు, పాలమూరు విశ్వవిద్యాలయం.


Next Story

Most Viewed