ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్.. రైతులను మోసం చేస్తున్నారంటూ..

by Dishafeatures2 |
ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్.. రైతులను మోసం చేస్తున్నారంటూ..
X

దిశ, దామరచర్ల: మండల పరిధిలోని విష్ణుపురం రైల్వే స్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వరకు బొగ్గు రవాణా కోసం చేపడుతున్న రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి(బీఎల్ఆర్ బ్రదర్స్) డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని తాళ్లవీరప్పగూడెం గ్రామంలో నిర్వాసిత రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైల్వే లైన్ నిర్మాణంలో విలువైన భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.40 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అధికారులు రైతులను తప్పుదోవ పట్టించకుండా రైతులకు సహకరించాలని కోరారు. ప్రభుత్వం భూ నిర్వాసితులకు అధిక మొత్తంలో నష్ట పరిహారం చెల్లిస్తామని కేవలం మాటలు చెప్పి కాలయాపన చేస్తూ అర్హులైన రైతులకు మోసం చేస్తున్నారని విమర్శించారు. భూ నిర్వాసితులకు మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మూడు పర్యాయాలు స్థానిక ఎమ్మెల్యే, తాహసీల్దార్, ఆర్డీవోలకు వినతి పత్రం ఇచ్చినా కూడా ఖాతరు చేయట్లేదని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌లో రైతుల నష్టపరిహారం చెల్లింపులో జాప్యంపై మాట్లాడి పరిస్థితిని వివరించారు.

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రైతులను అన్యాయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో పచ్చని తండాలను విధ్వసం చేస్తూ,నామమాత్రపు నష్టపరిహారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.అవినీతి అధికారుల ప్రమేయం లేకుండా నిర్వాసితులకు మెరుగైన నష్టపహారానికి ప్రభుత్వం ప్లాన్ ప్రకటించాలని తెలిపారు. ప్రతి ఒక్క నిర్వాసితునికి తక్షణమే నష్టపరిహారం, ఉద్యోగ హామీ పత్రాలను పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుల నర్సింహారెడ్డి, శ్రీనివాస్, మాళోతు జనార్దన్ నాయక్, సీపీఎం నాయకులు బైరం దయానంద్, వినోద్, ఆకారపు గోపాల్, గాలం వెంకన్న యాదవ్, బంటు కిరణ్, నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed