కాంగ్రెస్ అందుకే నల్ల దుస్తులు ధరించింది: అమిత్ షా

by Disha Web |
కాంగ్రెస్ అందుకే నల్ల దుస్తులు ధరించింది: అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా దేశంలో పెరిగిన ధరలు, నిరుద్యోగంపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. కేంద్ర ప్రభుత్వ వీటిని నివారించే దిశగా చర్యలు చేపట్టాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే తమ నిరసనల్లో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ నేతలందరూ నల్లని దుస్తులు ధరించి నిరసన తెలిపారు. అయితే శుక్రవారం కాంగ్రెస్ నల్ల దుస్తులు ధరించి నిరసన తెలపడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైరయ్యారు. కాంగ్రెస్ కావాలనే ఈ రోజును ఎంచుకుని నల్ల దుస్తులు ధరించి నిరసన తెలుపుతుందని అన్నారు. 'కాంగ్రెస్ తన బుజ్జగింపు రాజకీయాలను మరింత ప్రమోట్ చేసుకునేందుకు ఈ నిరసనలు చేస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రతి రోజూ నిరనసలు చేస్తోంది. కానీ ఈరోజే ప్రత్యేకంగా నల్ల దుస్తులు ధరించిందో మొదట నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ రోజునే ప్రధాని నరేంద్ర మోదీ రామ జన్మభూమికి పునాది వేశారు. ఈ రోజు నల్ల దుస్తుల్లో నిరనస తెలపడం ద్వారా కాంగ్రెస్ యాంటీ రామ మందిరం మెసేజ్‌ను వ్యాప్తి చేస్తోంది'' అని అమిత్ షా చెప్పుకొచ్చారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed