Breaking: జగ్గారెడ్డి ఔట్.. ఊహించని షాకిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం

by Disha Web Desk 2 |
Breaking: జగ్గారెడ్డి ఔట్.. ఊహించని షాకిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఏఐసీసీ షాక్ ఇచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశం పెట్టడమే కాకుండా, తీవ్రస్థాయిలో సవాళ్లు విసరడంతో ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించింది. అంతేగాకుండా పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతల నుంచి కూడా జగ్గారెడ్డిని తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆదివారం సాయంత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్లకు సంబంధించిన పని విభజనను ఏఐసీసీ లేఖ ద్వారా రాష్ట్రానికి పంపించింది.

ఈ లేఖలో నలుగురి బాధ్యతలను వెల్లడించింది. జగ్గారెడ్డికి మాత్రం ఎలాంటి బాధ్యతలను ఇవ్వలేదు. గీతారెడ్డి, అంజన్​కుమార్​యాదవ్, అజారుద్దీన్, మహేశ్​కుమార్​గౌడ్‌లకు సంబంధించిన బాధ్యతలను సూచించారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ నియామకంలో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జగ్గారెడ్డి.. పలుమార్లు ఏఐసీసీకి కూడా లేఖలు రాశారు. ఈ లేఖలో స్వతంత్రంగా ఉంటానని హైకమాండ్‌కు వెల్లడించారు. తాజాగా ఆదివారం కాంగ్రెస్ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆధ్వర్యంలో పార్టీ సీనియర్‌ నేతలు కొందరు ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగ్గారెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశాన్ని ఏఐసీసీ సీరియస్‌గా పరిగణించింది. దీనిలో భాగంగానే జగ్గారెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తొలిగించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.







Next Story

Most Viewed