కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమిత్ షా దగ్గరికి ఎందుకు పోయావ్...?

by Disha Web |
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమిత్ షా దగ్గరికి ఎందుకు పోయావ్...?
X

దిశ, చండూరు: నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాజీ హోంమంత్రి జానారెడ్డి, పీసీసీ నేతలు రామ్ రెడ్డి దామోదర్, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.... 'మునుగోడు ప్రాంత ప్రజలు కోమటిరెడ్డి బ్రాండ్ ను చూసి నీకు ఓటు వేయలేదు. కేవలం కాంగ్రెస్ బ్రాండ్ ను చూసి నీకు ఓటు వేస్తే, నువ్వు మతోన్మాద పార్టీ అయిన బీజేపీతో చేతులు కలపడం న్యాయమా?. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడటం చాలా బాధాకరం. ఎన్నికల ముందు కేసీఆర్ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదు. మునుగోడులో కాంగ్రెస్ సభ జరుగుతుంటే, నీవు అమిత్ షా దగ్గరికి ఎందుకు పోయావు తేల్చి చెప్పాలి. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించాము. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఎలా మోసం చేయాలనిపించింది. అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీకు రాజకీయంగా జన్మనిస్తే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచావు. నీ మునుగోడు ప్రాంత ప్రజలు నీకు సరైన సమాధానం చెప్తారు. రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి రాజగోపాల్ అన్యాయం చేస్తున్నారు. ఆయన ఎందుకు బీజేపీకి వెళ్తున్నారో ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. ఈ మునుగోడు గడ్డ, కాంగ్రెస్ అడ్డా. మునుగోడులో గెలిచేది కాంగ్రెస్ జెండానే. రాజగోపాల్ రెడ్డి ఈ మునుగోడు ప్రాంత ప్రజలు నిన్ను పాతాళానికి తొక్కి వేస్తారు' అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజ్, సీనియర్ నేతలు మల్లు రవి, బెల్యా నాయక్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్, ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి, ఆలేరు కాంగ్రెస్ ఇంచార్జి బీర్లా ఐలయ్య యాదవ్, పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత, తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవికుమార్, నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్, వివిధ జిల్లాల అధ్యక్షులు, వివిధ మండలాల ఎంపీపీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed