ఏపీ కేబినెట్ భేటీ రద్దు

by Disha Web |
ఏపీ కేబినెట్ భేటీ రద్దు
X

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగే మంత్రివర్గ సమావేశం రద్దు అయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లాల్సిన నేపథ్యంలో కేబినెట్ భేటీ రద్దు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాష్ట్రమంత్రివర్గ భేటీ ఈ నెల 22న జరగాల్సి ఉంది. అయితే ఆ భేటీని ప్రభుత్వం రద్దు చేసింది. దానిని కాస్తా జూన్ 24కు వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం జరగనుందని సీఎస్ సమీర్ శర్మ ప్రకటన సైతం విడుదల చేశారు. అయితే శుక్రవారం రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా ఎన్డీఏ ఆహ్వానించడంతో సీఎం జగన్ శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో శుక్రవారం జరగాల్సిన కేబినెట్ భేటీ రద్దు అయ్యింది.


Next Story