CM Jagan: రేపు వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

by Disha Web Desk 2 |
CM Jagan to Visit Flood Affected Areas On July 26
X

దిశ, ఏపీ బ్యూరో : CM Jagan to Visit Flood Affected Areas On July 26| ఏపీ సీఎం జగన్ మంగళవారం కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారు. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో వరద భాదితులను ఆయన పరామర్శిస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం సీఎంవో విడుదల చేసింది. రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ ఉ.10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉ.11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. అనంతరం అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో వరద ప్రభావం, ప్రభుత్వం తీసకున్న సహాయక చర్యలు, బాధితులకు అందిన వరదసాయంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్ బస చేయనున్నారు. ఇకపోతే జగన్ పర్యటనలో భాగంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రెండు నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ ప్రాబల్యం ఉన్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు పలువురుని ప్రభుత్వ యంత్రాంగం ఎంపిక చేసింది.

ఇది కూడా చదవండి: పుంగనూరు ఆవును 4.10 లక్షలకు కొన్న రాందేవ్ బాబా

Koo App
గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) రూ. 5 కోట్ల విరాళం. విరాళానికి సంబంధించిన చెక్‌ను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌కు అందజేసిన గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి. #CMYSJagan #AndhraPradesh - YSR Congress Party - YSRCP (@YSRCPOfficial) 25 July 2022


Next Story

Most Viewed