'చైనా మానవ హక్కులపై దశాబ్దాలుగా దాడి చేస్తోంది'

by Disha Web |
చైనా మానవ హక్కులపై దశాబ్దాలుగా దాడి చేస్తోంది
X

దిశ, వెబ్‌డెస్క్: యూఎస్, చైనాల మధ్య గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు వస్తున్నాయి. ఇరు దేశాల నేతలు పరోక్షంగా వార్నింగ్‌లు ఇచ్చుకుంటున్నాయి. చైనా ఇప్పటికే పలు సార్లు ప్రత్యక్షంగా యూఎస్‌కు వార్నింగ్ ఇచ్చింది. అయితే తాజాగా మరోసారి యూఎస్ చైనా విషయంలో తల దూర్చింది. తాజాగా అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి చైనా, టిబెట్ సంబంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టిబెట్ మానవ హక్కులపై దశాబ్దాలుగా దాడి చేసిందని అన్నారు. అంతేకాకుండా టిబెట్ స్వయంప్రతిపత్తితో సంబంధం లేకుండా చైనా వ్యవహరించిందని అన్నారు. వాషింగ్‌టన్‌లో జరిగిన ఓ సమావేశంలో పెలోసి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో టిబెటన్ పార్లమెంట్-ఇన్-ఎక్సైల్ నుండి దాదాపు 100 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టిబెట్ ఆందోళనలను పరిష్కరించడం ప్రపంచ నైతిక బాధ్యత అని ఆమె అన్నారు.

Next Story