చిన్నప్పటి వెయిట్ స్మెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపిస్తుంది.. ఎలా?

by Disha Web |
చిన్నప్పటి వెయిట్ స్మెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపిస్తుంది.. ఎలా?
X

దిశ, ఫీచర్స్ : 12 నెలల అన్‌ప్రొటెక్టెడ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ తర్వాత కూడా పిల్లలు పుట్టలేదంటే ఆ పార్ట్‌నర్స్‌లో ఇన్‌ఫెర్టిలిటీ సమస్య ఉన్నట్లేనని హెచ్చరిస్తోంది WHO. ఆ లోపం అబ్బాయిలో ఉందా లేక అమ్మాయిలోనా తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించాల ని సూచిస్తోంది. సాధారణంగా మెడికల్ సిరల వాపు (వేరికోసెల్), ఇన్ఫెక్షన్, ట్యూమర్స్, హార్మోన్ల సమస్యలు లేదా వృషణాలు తగ్గడం వల్ల పురుషుల్లో మెడికల్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. హార్మ్‌ఫుల్ రేడియేషన్, మోడ్రన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడకం కూడా అబ్బాయిల్లో సమస్యలకు కారణమవుతుండగా.. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ స్పెర్మ్ కౌంట్, టెస్టోస్టెరాన్ లెవల్స్‌పై ఇంపాక్ట్ చూపుతున్నాయి. కాగా తాజా అధ్యయనం పురుషుల్లో మరో కొత్త ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ గురించి వివరించింది. చిన్నప్పటి బరువు కూడా అబ్బాయిల స్పెర్మ్ కౌంట్‌పై ఎఫెక్ట్ చూపుతుందని స్పష్టం చేస్తూ.. మేల్ ఇన్‌ఫెర్టిలిటీ, వెయిట్‌కు మధ్య లింక్ గురించి వివరించింది.

'అధిక బరువు(ఊబకాయం) కలిగిన పిల్లలు.. సాధారణ బరువున్న చిన్నారులతో పోలిస్తే చిన్న వృషణాలను కలిగి ఉంటారు. వాస్తవానికి వృషణ పరిమాణం స్పెర్మ్ కౌంట్‌తో ముడిపడి ఉంటుంది. చిన్న వృషణాలు తక్కువ స్పెర్మ్‌ను ఉత్పత్తి చేస్తాయి. బాల్యం మరియు కౌమారదశలో ఆరోగ్యకరమైన శరీర బరువును మెయింటెన్ చేయడం వలన ఫ్యూచర్‌లో వంధ్యత్వాన్ని నిరోధించవచ్చు. ప్రస్తుతం 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో నాలుగింట ఒక వంతు అబ్బాయిలు తక్కువ వృషణాల పరిమాణం లేదా సాధారణం కంటే చిన్న వృషణాలను కలిగి ఉన్నారు. ఇది వారి భవిష్యత్తు సంతానోత్పత్తికి ప్రమాదం కలిగిస్తుంది.

Next Story