LPG గ్యాస్ సబ్సిడీలో మీ పేరు ఉందా..? ఇలా చెక్ చేసుకోండి

by Disha Web Desk 17 |
LPG గ్యాస్ సబ్సిడీలో మీ పేరు ఉందా..? ఇలా చెక్ చేసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం ఇటీవల గ్యాస్ ధరలు భారీగా పెంచింది. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో రూ. 200 సబ్సిడీ ప్రకటించింది. అది కూడా అందరికీ కాకుండా 9 కోట్ల మందికి మాత్రమే సబ్సిడీ ఇస్తుంది. అయితే ఇంతకుముందు సబ్సిడీ వచ్చిన వారికి ఇప్పడు వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ లిస్ట్‌లో నుంచి కొంత మందిని తొలగించింది. సబ్సిడీ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా అని ఈ విధంగా తెలుసుకొగలరు.

* ముందుగా www.mylpg.in కు వెళ్ళాలి.

* దీనిలో మీరు ముందే లాగిన్ అయి ఉంటే గనుక సైన్ ఇన్ కావాలి. లేకపోతే కొత్త వివరాలతో లాగిన్ కావాలి.

* వెబ్‌పేజిలోగ్యాస్ చిత్రాలు కనిపిస్తాయి. అందులో మీ కంపెనీని ఎంచుకోవాలి.

* తర్వాత వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీపై క్లిక్ చేయాలి.

* మీ సిలిండర్‌కు సబ్సిడీ వచ్చిందా లేదా వివరాలు డిస్‌ప్లే అవుతాయి.

* సబ్సిడీ డబ్బులు రాకపోతే వెబ్‌సైట్‌లోనే ఫిర్యాదు కూడా చేయవచ్చు.


Next Story

Most Viewed