కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే.. రాష్ట్ర రైతు సంఘం డిమాండ్

by Disha Web |
కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే.. రాష్ట్ర రైతు సంఘం డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంజాబ్ రాష్ట్రంలో విపరీతమైన ఎండల వల్ల 18 శాతం తాలు గింజ ఉన్నా ధాన్యాన్ని కొనుగోలు చేశారని, అదేవిధంగా రాష్ట్రంలో వెంటనే నాణ్యత ప్రమాణాలతో ముడి పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో గత అక్టోబర్ నెల నుంచి 9 కోట్ల 40 లక్షల క్వింటాళ్ల ధాన్యం గోదాముల్లో మిల్లులలో నిల్వచేయబడి ఉందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్రం, రాష్ట్రం నువ్వంటే నువ్వు అని కోట్లాడుతున్నాయని తెలిపారు.

కేంద్రం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు నాణ్యతా ప్రమాణాలు ఉంటేనే కొనుగోలు చేస్తామని చెప్పడం అంటే పరోక్షంగా అసలు ధాన్యం కొనుగోలు చేయమని చెప్పటమేనని ఆరోపించారు. 9 కోట్ల నలభై లక్షల ధాన్యాన్ని మట్టిపాలు చేయడానికి కేంద్రం పూనుకుంటే ప్రజా రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని వేలంపాట నిర్వహించి కొంత మేర కైనా నష్టాన్ని పూడ్చుకోవటానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మిగిలిన 75 శాతం ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాలతో ముడి పెట్టకుండా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed