మల్లు స్వరాజ్యం మృతి పట్ల ప్రముఖుల సంతాపం

by Disha Web Desk 12 |
మల్లు స్వరాజ్యం మృతి పట్ల ప్రముఖుల సంతాపం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కామ్రేడ్ మల్లు స్వరాజ్యం పేరు వింటేనే తెలంగాణ పోరాటం గుర్తుకు వస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సాయుధ పోరాట యోదురాలుగా ఆయుధం చేపట్టిన యోదురాలని, దళ కమాండర్‌గా పోరాటాలు చేశారని అన్నారు. ఆమె మరణించడం చాలా భాధకరం, ఆమె నిండు జీవితం కమ్యూనిస్టు ఉద్యమం కోసం, సీపీఐ(ఎం) పార్టీ అభివృద్ధి కోసం పని చేసిందన్నారు. ఆమె స్ఫూర్తితో తెలంగాణలో భవిష్యత్తు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆమెకు విప్లవ జోహార్లు తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.



వేలాది మంది మహిళలకు వేలాది మంది మహిళలకు: సురవరం

ప్రముఖ మహిళా నాయకురాలు మల్లు స్వరాజ్యం గారి మృతి తీవ్రమైన బాధను కలిగించింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. శాసనసభ్యురాలిగా రైతులు శ్రామికులు పేద ప్రజల తరఫున వారి వాణి వినిపించారు. వేలాది మంది మహిళలకు కమ్యూనిస్టు కార్యకర్తలకు వేలాది మంది మహిళలకుని కలిగించారు. చివరిదాకా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆమె ఒక అరుదైన పోరాట యోధురాలు. సీపీఐ జాతీయ సమితి తరపున వారికి నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి.



మల్లు స్వరాజ్యం మృతికి సీపీఐ సంతాపం: చాడ వెంకట్ రెడ్డి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మృతికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. భూస్వామ్య నిజాం వ్యతిరేక పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన, తుపాకి పట్టిన వీరవనిత అని అన్నారు. ఆమె మరణం వామపక్షాలకు, రాష్ట్రానికి తీరని లోటు అన్నారు. ఆమె మృతికి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.



చైతన్య దీపిక మల్లు స్వరాజ్యం: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా పేదల పక్షాన పోరాటం చేసిన తెలంగాణ చైతన్య దీపిక మల్లు స్వరాజ్యం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, కమ్యూనిస్టు నేత మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం తెలంగాణకు తీరని లోటని ఆమెకు నివాళులర్పించారు.



Next Story