'బాబోయ్.. ఆమెకు ఇదేం అలవాటు' అంటూ విస్తుపోతున్న నెటిజన్స్

by S Gopi |   ( Updated:2022-03-26 03:23:14.0  )
బాబోయ్.. ఆమెకు ఇదేం అలవాటు అంటూ విస్తుపోతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మహిళకు సంబంధించిన అలవాటుపైన జోరుగా చర్చ జరుగుతోంది. ఆమెకున్న అలవాటుపై కామెంట్లు పోస్టు చేస్తున్నారు. బాబాయ్.. ఆమెకు ఇదేం అలవాటు అంటూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కెనడాకు చెందిన ఓ మహిళకు రబ్బరు చెప్పులంటే చాలా ఇష్టం. దీంతో ఆ మహిళ తన బెడ్ రూమ్ ను రబ్బరు చెప్పులతో అందంగా అలంకరించాలని అనుకున్నది. అనుకున్న విధంగా ఆ మహిళ ఎక్కడికి వెళ్లినా రబ్బరు చెప్పులను కొని వాటన్నిటినీ తన బెడ్ రూమ్ లో అందంగా అలంకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్స్ షాక్ అవుతూ బాబోయ్.. ఆమెకు ఇదేం అలవాటు అంటూ రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed