300 మంది ఉద్యోగులను తొలగించిన వైట్‌హ్యాట్ జూనియర్!

by Dishanational1 |
300 మంది ఉద్యోగులను తొలగించిన వైట్‌హ్యాట్ జూనియర్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బజూస్‌కు చెందిన ఆన్‌లైన్ కోడింగ్ సంస్థ వైట్‌హ్యాట్ జూనియర్ ఒకేసారి 300 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి తిరిగి ఆఫీసులకు రావాలని కంపెనీ కోరడంతో 1000 మంది తమ ఉద్యోగాలకు రాజీనామ చేయగా, ఇప్పుడు కంపెనీయే అదనంగా మరో 300 మందిని తొలగించింది. కంపెనీ తొలగించిన వారిలో ఎక్కువమంది కోడింగ్ బోధించే వారితో పాటు సేల్స్ టీమ్‌లో పనిచేస్తున్నవారు ఉన్నారు. బయటకు పంపించిన ఉద్యోగులకు అదనంగా ఒక నెల జీతం ఇచ్చి సాగనంపినట్టు సమాచార్మ. కంపెనీ వ్యాపార ప్రాధాన్యతలను సరిదిద్దేందుకు, దీర్ఘకాలంలో వృద్ధి సాధించడానికి, మెరుగైన సేవలందించేందుకు సమీక్ష జరుపుతున్నామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా మహమ్మారి పరిస్థితులు సద్దుమణిగి పాఠశాలలు, కాలేజీలు, ట్యూషన్లు పునఃప్రారంభం కావడంతో ఎడ్‌టెక్ పరిశ్రమ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందఅని కంపెనీ అభిప్రాయపడింది.


Next Story