టెస్ట్ క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ రికార్డ్.. బ్రాడ్‌కు చుక్కలే!

by Disha Web |
టెస్ట్ క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ రికార్డ్.. బ్రాడ్‌కు చుక్కలే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా, ఇంగ్లాండ్‌ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతోన్న రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ సువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో బుమ్రా 29 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన బుమ్రా మరో సింగిల్ తీశాడు. దీనితో ఒక టెస్టులో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా శనివారం ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డ్ గతంలో వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మెన్ బ్రియాన్ లారా పేరిట ఉండేది. లారా ఒకే ఓవర్‌లో 28 పరుగులు చేయగా.. తాజాగా ఇంగ్లాండ్‌పై బుమ్రా 29 పరుగులు చేసి లారా రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ఇక బ్రాడ్ బుమ్రా దెబ్బతో ఆరు ఎక్స్‌ట్రాలు సహా ఒకే ఓవర్లో మొత్తం 35 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు భారత్.. 416 పరుగు వద్ద ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో కీపర్ రిషబ్ పంత్, ఆల్ రౌండర్ జడేజా సెంచరీలతో రాణించడంతో ఇండియా భారీ స్కోర్ చేసింది. చివర్లో కెప్టెన్ బుమ్రా చెలరేగిపోయాడు. బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 35 చేశాడు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed