సింహాలకు చుక్కలు చూపించిన గేదె.. వీడియో వైరల్

by S Gopi |   ( Updated:2022-04-07 12:29:49.0  )
సింహాలకు చుక్కలు చూపించిన గేదె.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: తల్లి ప్రేమ ఎలా ఉంటదో మన అందిరికీ తెలిసిందే. అయితే, తన పిల్లలకు ఏదైనా ఆపద వస్తే తల్లి ఏ విధంగా స్పందిస్తదో.. అదేవిధంగా ఆ ఆపద నుంచి తన పిల్లలను ఏ విధంగా కాపాడుతదో మనకు తెలిసిందే. తల్లి ప్రేమ ఎలా ఉంటదో.. ఎవరైనా తన పిల్లలను టచ్ చేస్తే తల్లి ఎలా రియాక్టవుతదో అనేది ఓ వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సింహాల గుంపు గేదె పిల్లను వేటాడేందుకు ప్రయత్నిస్తుంటాయి. అది గమనించిన గేదె ఆ సింహాల గుంపును తరిమికొడుతది. ఒకటెనుక ఒకటి వస్తూ అవి వేటాడేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయినా కూడా ఆ గేదె వాటిని ఎదురుస్తుంటది. ఇది గమనించిన మిగతా గేదెలు కూడా వాటిని తరిమి తరిమి కొడుతాయి. వాస్తవానికి సింహాలను కానీ, చిరుత పులులను చూస్తే మిగతా జంతువులు భయపడి పరిగెడుతాయి. కానీ, గేదెలు సింహాలను పరిగెత్తించడంతో ఆ వీడియో భారీగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ వాహ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.



Next Story

Most Viewed