ప్రయివేట్ స్కూళ్ల ఫీజులను నియంత్రించాల్సిందే : బీఆర్ఎస్ ధర్నా

by Muthe.Rajitha |   (  Updated:2026-06-09 07:05:32  IST  )

ప్రయివేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై బీఆర్ఎస్ నాయకులు భారీ ధర్నాకు దిగారు.

ప్రయివేట్ స్కూళ్ల ఫీజులను నియంత్రించాల్సిందే : బీఆర్ఎస్ ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రయివేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై బీఆర్ఎస్ నాయకులు భారీ ధర్నాకు దిగారు. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో ఉన్న పాఠశాల విద్యాశాఖ సంచాలకుల (Director of School Education) ఆఫీసు ఎదుట BRS నాయకుల నిరసనలు, నినాదాలతో హోరెత్తిపోతోంది. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా పెరుగుతున్న ఫీజులను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. తెలంగాణ విద్యా సంస్థల చట్టాన్ని [Telangana Educational Institutions (Regulation of Admissions and Fee) Act] తక్షణమే పూర్తి స్థాయిలో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం వెంటనే ప్రత్యేక ఫీజు నియంత్రణ కమిటీలను (Fee Regulatory Committees) ఏర్పాటు చేసి, ప్రైవేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా పెంచుతున్న ఫీజులపై నియంత్రణ విధించాలని కోరారు.

డొనేషన్లు, రీ-అడ్మిషన్ ఫీజులు, ఇతర అదనపు రుసుముల పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలు చేస్తున్న అక్రమ వసూళ్లను అరికట్టాలని స్పష్టం చేశారు. కొత్త విద్యా సంవత్సరం (2026-27) ప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు ఏటా భారీగా ఫీజులను పెంచుకుంటూ పోతుండటంతో మధ్యతరగతి, పేద తల్లిదండ్రులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story