ప్రధాని రాజీనామా.. మంత్రులంతా మూకుమ్మడిగా..

by Dishafeatures2 |
ప్రధాని రాజీనామా.. మంత్రులంతా మూకుమ్మడిగా..
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. పార్టీ సభ్యులు, మంత్రులు అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తుండటంతో బోరిస్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే బ్రిటన్ రాజకీయాలు గత కొన్ని రోజులు హీటెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ నేత బోరిస్ రాజీనామా చేయాలని కోరారు. అనంతరం అతడిని విధుల నుంచి తొలగించిన బోరిస్ తాజాగా తన పదవికి రాజీనామా చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల వరుస రాజీనామాలు చేస్తూ బోరిస్‌పై తమ వ్యతిరేకతను కనబరచడంతో బోరిస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు బోరిస్ ప్రభుత్వంలో 54 మంది తమ పదవుల నుంచి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు బ్రిటన్ దేశానికి కొత్త ప్రధాని ఎన్నికయ్యేవరకు బోరిస్ జాన్సన్ ప్రధానిగా కొనసాగనున్నారు. బోరిస్ జాన్సన్ రాజీనామా దేశమంతా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో బ్రిటన్ తరువాయి ప్రధాని ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు ప్రారంభం అయ్యాయి.



Next Story