టీఆర్ఎస్ వేదికపై బీజేపీ మహిళా కార్యకర్త (వీడియో)

by Disha Web |
టీఆర్ఎస్ వేదికపై బీజేపీ మహిళా కార్యకర్త (వీడియో)
X

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ చర్చా వేదిక వద్ద బీజేపీ మహిళా కార్యకర్త ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. హుజురాబాద్‌లో జరిగిన అభివృద్ధిపై టీఆర్ఎస్ బహిరంగ చర్చకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో టీఆరెస్ పార్టీ ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేయగా అక్కడకు బీజేపీ మహిళా కార్యకర్త చేరుకోవడంతో టీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. వేదిక కింద ఉన్న టీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు ఆమెను కిందకు దింపారు. బీజేపీ కార్యకర్త మాత్రం టీఆర్ఎస్ నాయకులతో చర్చకు దిగేందుకు ప్రయత్నించారు.


కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed