ఉదయ్‌పూర్ హంతకుడికి బీజేపీతో సంబంధాలు

by Disha Web |
ఉదయ్‌పూర్ హంతకుడికి బీజేపీతో సంబంధాలు
X

జైపూర్: ఉదయ్‌పూర్‌లో దర్జీని దారుణంగా హత్య కేసుపై కాంగ్రెస్ కీలక ఆరోపణలు చేసింది. ప్రధాన నిందితుల్లో ఒకరు బీజేపీ సభ్యుడని ఆరోపించింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కి బదిలీ చేయడానికి కేంద్రం త్వరగా స్పందించకపోవడానికి కారణమిదే అని అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రధాన హంతకుడైన రియాజ్ అత్తారి బీజేపీ పార్టీ సభ్యుడని కాంగ్రెస్ ఆరోపించింది. ఉదయ్ పూర్ ఘటనలో ప్రధాన నిందితుడు రియాజ్ అత్తారికి బీజేపీతో సంబంధాలు ఉండడం సంచలనత్మాకమైన అంశమని సీనియర్ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రియాజ్ అత్తారి బీజేపీ నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారని అన్నారు. ఇదొక్కటే కాదు, బీజేపీ రాజస్థాన్ మైనారిటీ యూనిట్ సమావేశాలకు హాజరైన చిత్రాలు కూడా ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనిని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా నకిలీ వార్తలని కొట్టిపారేశారు. ''ఇలాంటి నకిలీ వార్తలు వ్యాప్తి చేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేయలేదు. ఉదయ్ పూర్ హంతకులు బీజేపీ సభ్యులు కాదు. రాజీవ్ గాంధీని చంపడానికి కాంగ్రెస్‌లోకి ప్రవేశించడానికి ఎల్‌టీటీఈ హంతకుడు చేసిన ప్రయత్నంలా వారి వ్యాఖ్యలు ఉన్నాయి.'' అని ఎద్దేవా చేశారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed