- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కిడ్నీ హెల్త్.. బెస్ట్ టిప్స్! మూత్రపిండాల్లో రక్తప్రవాహన్ని అడ్డుకుంటున్న స్మోకింగ్

దిశ, ఫీచర్స్ : కీడ్నీలను ఆరోగ్యంగా ఉంచడమనేది బిగ్ టాస్క్. మన శరీర వ్యర్థాలను సరిగ్గా ఫిల్టర్ చేసి బయటకు పంపేందుకు, హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ అవి సరిగ్గా పనిచేసేలా చేస్తుంటాయి. వివిధ జీవక్రియ వ్యర్థాల రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తపోటు నియంత్రణ, ఎముకల ఆరోగ్యంగా ఉంచడం, హిమోగ్లోబిన్ లెవల్స్ నార్మల్‌గా ఉండేలా చూడటం, శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ మెయింటెనెన్స్‌లో సహాయపడతాయి. ఏదేమైనా కిడ్నీస్ సైలెంట్ కిల్లర్స్ అని చెప్తుంటారు నిపుణులు. మూత్రపిండాల వ్యాధి బయటపడేందుకు ఎక్కువ కాలం తీసుకుంటుందని, కానీ రెగ్యులర్ చెకప్స్ వల్ల సకాలంలో గుర్తించి హెల్తీగా ఉండొచ్చని సూచిస్తున్నారు. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని టిప్స్ అందిస్తున్నారు.
1. రెగ్యులర్ ఎక్సర్సైజ్ కీలకం
రోజూవారి వ్యాయామం హై బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల వ్యాధి నివారణలో ఈ రెండు కీలకం. ఎక్సర్సైజ్ అంటే మారథాన్‌లో పాల్గొనడం కాదన్న నిపుణులు.. రన్నింగ్, సైక్లింగ్, ఏదైనా డ్యాన్స్ ఫామ్ చేయడం లాంటి మితమైన వ్యాయామ పద్ధతులు సైతం కిడ్నీ ఆరోగ్యానికి అద్భుత ఔషధాలుగా పనిచేస్తాయి. వీటిలో మిమ్మల్ని ఆనందపరిచే ఎక్సర్సైజ్ టెక్నిక్ ఎంచుకుని, దానికి కట్టుబడి ఉండటం వల్ల బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని సూచిస్తున్నారు.
2. నీరు ఎక్కువగా తాగాలి
వాటర్ తాగడాన్ని హ్యాబిట్‌గా మార్చుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు దరిచేరవని చెప్తున్నారు నిపుణులు. రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని చెప్తున్నారు. ఈ నీరు కిడ్నీల నుంచి సోడియం, ఇతర టాక్సిన్స్‌ను బయటకు పంపేందుకు సహాయపడుతుంది. తద్వారా మూత్రపిండాల వ్యాధి సోకే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గతంలో కిడ్నీలో స్టోన్స్‌తో బాధపడిన వారు.. వీటి నివారణకు, భవిష్యత్తులో మళ్లీ ఆ సమస్యను ఎదుర్కోకుండా ఉండేందుకు ఎక్కువ నీటిని సేవించడం బెటర్ అని సూచిస్తున్నారు.
3. ధూమపానం హానికరం
స్మోకింగ్ రక్తనాళాలను అడ్డుకుంటుంది. ఈ క్రమంలోనే మూత్రపిండాలలో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. కిడ్నీ క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు ధూమపానం మానేసినట్లయితే RCC పొందే ప్రమాదం తగ్గుతుంది. ధూమపానం అనేది మూత్రపిండ కణ క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు ధూమపానం మానేసినట్లయితే RCC పొందే ప్రమాదం తగ్గుతుంది.
4. రెగ్యులర్ చెకప్
మధుమేహ వ్యాధిగ్రస్తులు, తక్కువ బరువుతో జన్మించిన వ్యక్తులు, హృదయ సంబంధ సమస్యలు, అధిక రక్తపోటు, ఊబకాయం ఉన్నవారు, వంశపారంపర్యంగా మూత్రపిండాల వ్యాధి కలిగిన ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి కిడ్నీ వ్యాధులు సంక్రమించే అవకాశాలు అధికం. ఈ వ్యక్తులు ప్రమాదంలో ఉన్నందున వీరు క్రమం తప్పకుండా కిడ్నీ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
5. డాక్టర్ సలహా లేకుండా మాత్రలు తీసుకోవద్దు
డాక్టర్ సిఫార్సు చేసినప్పుడే మందులు తీసుకోండి. అలా కాకుండా ప్రతి నొప్పికి ట్యాబ్లెట్ తీసుకున్నట్లయితే కిడ్నీ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఇబుప్రోఫెన్, న్యాప్రోక్సెన్ వంటి పెయిన్ కిల్లర్లు వాడితే మూత్రపిండాలను దెబ్బతింటాయి. ఒకవేళ మూత్రపిండాల నొప్పి పెరుగుతున్నట్లయితే.. ఇంట్లోనే టైమ్ వేస్ట్ చేసే బదులు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.