- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Health Tips: ఈ సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ పండ్లతో చెక్ పెట్టండి..?

దిశ, వెబ్‌డెస్క్: ద్రాక్ష(Grapes) ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. రుచిలో కూడా గ్రేప్స్ రుచి అద్భుతమని చెప్పుకోవచ్చు. ద్రాక్ష గుండె-ఆరోగ్యకరమైనది. ఎందుకంటే ఇవి ఫ్లేవనాయిడ్లు అండ్ ఇతర సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గించడంలో.. గుండె జబ్బుల ప్రమాదానికి చెక్ పెట్టడంలో ద్రాక్ష సహాయపడుతుంది.
ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వల్ల, ద్రాక్ష తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ద్రాక్షలోని పోషకాలు క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, కంటి సమస్యలు వంటివి దూరం అవుతాయి. ద్రాక్షలోని కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో తోడ్పడతాయి.
ద్రాక్షలోని పాలీఫెనాల్స్ (Polyphenols)హృదయ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఫ్లేవనాయిడ్లు కొలెస్ట్రాల్ అండ్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. గ్రేప్స్‌లోని మెలటోనిన్ హార్మోన్ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇక ఎండుద్రాక్ష తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
అయితే ముఖ్యంగా నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్గ్యానిక ముందుగా, నల్ల ద్రాక్ష జీర్ణవ్యవస్థకు ఒక వరమని సూచిస్తున్నారు. ఇందులో లభించే ఫైబర్ కడుపు సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది. మీకు గ్యాస్, మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలు ఉంటే ఈ పండు ఉపశమనం కలిగిస్తుంది. చలికాలంలో హెల్త్‌ను కాపాడుకోవాలంటే ఎండు ద్రాక్ష బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
ఇన్ని ప్రయోజనాలున్న ద్రాక్షను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎండుద్రాక్షను నైట్ అంతా వాటర్‌లో నానబెట్టి.. ఉదయం ఆ నీటితో అల్పాహారంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పొడి రూపంలో తీసుకుంటే లాభాలు తక్కువ అని సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.