మెగాస్టార్, సూపర్ స్టార్‌ని కించపరిచిన బండ్ల గణేష్..

by Disha Web |
మెగాస్టార్, సూపర్ స్టార్‌ని కించపరిచిన బండ్ల గణేష్..
X

దిశ, వెబ్‌డెస్క్: బండ్ల గణేష్ స్పీచ్‌లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్, ఫాలోయింగ్ అంత ఇంత కాదు. ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే మాటలు అంటే అభిమానులు చెవులు రిక్కించి మరీ వింటారు. అలాంటి బండ్ల గణేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా ఆకాష్ పూరి హీరోగా రాబోతున్న చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ''మాటలు రానీ వారికి మాటలు నేర్పించావ్.. డ్యాన్సులు నేర్పించావ్.. నీ డైలాగ్స్‌తో ఎంతో మందిని స్టార్లను, మెగాస్టార్లను.. సూపర్ స్టార్లను చేశావు అంటూ చెప్పుకొచ్చాడు''. అంతే దీంతో అందరూ బండ్ల గణేష్‌ను తప్పుబట్టడం మొదలు పెట్టారు. సూపర్ స్టార్ అని ఎందుకన్నావ్, అసలు చిరంజీవితో పూరి జగన్నాథ్ సినిమాలే తీయలేదు.. అలాంటప్పుడు మెగస్టార్ అని ఎందుకన్నావ్ అంటూ చిరు అభిమానులు, మహేశ్ బాబు అభిమానులు మండిపడుతున్నారు.

Next Story