ఈ రెండు బాటిళ్లు కేసీఆర్‌కు పంపిస్తున్నా... : బండి సంజయ్

by Disha Web |
ఈ రెండు బాటిళ్లు కేసీఆర్‌కు పంపిస్తున్నా... : బండి సంజయ్
X

దిశ, భువనగిరి రూరల్: ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి దాసోజు శ్రవణ్ ను బీజేపీలో చేరాలని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆహ్వానించారు. దాసోజు శ్రవణ్ జాతీయ భావాలున్న వ్యక్తి అని, గతంలో ఏబీవీపీలో పనిచేసిన నాయకుడని చెప్పారు. దాసోజు శ్రవణ్ ఘర్ వాపాసీలో భాగంగా బీజేపీలో చేరాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఈనెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నారని తెలిపారు.

ప్రజా సంగ్రామ యాత్ర 4వ రోజూలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బట్టుగూడెం వద్ద ముసీ నదిని సందర్శించారు. ఆ తరువాత పోచంపల్లి మండలంలోని పెద్దరావులపల్లి మూసీ బాధిత గ్రామ ప్రజలతో రచ్చ బండ నిర్వహించిన అనంతరం ముక్తాపూర్ గ్రామ సమీపంలో ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, సహ ప్రముఖ్ జిట్టా బాలక్రిష్ణారెడ్డిలతో కలిసి పాదయాత్ర నిర్వహించిన ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్ర 4వ రోజులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి అక్కడ నివసిస్తున్న ప్రజల దుస్థితిని, వారు పడుతున్న బాధలను చూడడం జరిగిందని అన్నారు. మూసీ నదిలో స్నానం చేస్తానని, బోట్లు వేసుకుని తిరిగే పరిస్థితి తీసుకొస్తానని, కొబ్బరి నీళ్లలా మారుస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలేమయ్యాయని ఆయన ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంత గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు ఎంత దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారో కేసీఆర్ కు తెలియజేయడానికి నీళ్ల బాటిల్లో మూసి నీళ్ళను ఆయనకు కొరియర్ చేస్తునట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రజల బాధలను ద్రుష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మూసీ ప్రక్షాళన కోసం రూ.4 వేల కోట్లు విడుదల చేయాలని మరియు యుద్ధ ప్రాతిపదికన మూసీ ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దాసోజు శ్రవణ్ జాతీయ భావాలున్న వ్యక్తి

దాసోజు శ్రవణ్ జాతీయ భావాలున్న వ్యక్తి అని, బీజేపీలో చేరాలని ఆయనను ఆహ్వానిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో శ్రవణ్ చురుగ్గా పాల్గొన్నారని, తెలంగాణ ఏర్పాటులో ఆయన కీలక భూమిక పోషించారని అన్నారు. దాసోజు శ్రావణ్ గతంలో ఏబీవీపీ తరపున అనేక ఉద్యమాలు చేశారని, తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాస్తవాలను వివరించేవారని అన్నారు. తెలంగాణ ఆకాంక్ష, ఉద్యమం విషయంలో తనతోపాటు అనేక మందికి సూచనలు, సలహాలివ్వడం జరిగిందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంతవరకు మంచివాడే కానీ రాజీనామా చేసి బీజేపీలోకి వస్తాననగానే కాంట్రాక్టులిచ్చారనే ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ నెల 21 న అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని డబ్బులు వెదజల్లినా జనం నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో భారీ విజయంతో గెలిచి తీరుతుందని, మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నిక అని అన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed