పిల్లల్ని కనేందుకు బెయిల్ ఇవ్వొచ్చు.. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

by Disha Web |
పిల్లల్ని కనేందుకు బెయిల్ ఇవ్వొచ్చు.. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పలు కేసుల్లో కోర్టులు సంచలన తీర్పులు మంజురూ చేస్తూ జనాలకు సంతోషాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే మరోసారి రాజస్థాన్ హైకోర్టు సంచలన ఉత్తర్వులిచ్చింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన నంద్ లాల్ అనే వ్యక్తి ఓ కేసులో జీవితఖైదీ శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తన వ్యక్తిగత అవసరాల కోసం 15 రోజులు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ.. అజ్మిర్ జిల్లా కమిటీకి ధరఖాస్తు చేశాడు. అయితే జిల్లా కమిటీ లాల్‌కు పెరోల్ ఇవ్వలేదు. దాంతో అతని భార్య పిల్లలను కనేందుకు తన భర్తకు 15 రోజులపాటు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. భర్తతో సంతానాన్ని పొందే హక్కు ఆ మహిళకు ఉందని, దోషిని సాధారణ స్థితికి తీసుకురావడానికి దాంపత్య బంధం సహాయపడుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు లాల్‌కు 15 రోజులు పెరోల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణ జరపనుంది.


Next Story

Most Viewed