బాబు.. టీడీపీని నా పార్టీలో విలీనం చెయ్.. కే ఏ పాల్

by Disha Web |
బాబు.. టీడీపీని నా పార్టీలో విలీనం చెయ్.. కే ఏ పాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రజలు తనను సీఎంగా చూడాలనుకుంటున్నారని, ఒక సర్వేలో ఈ విషయం తేలిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ అన్నారు. గురువారం ఆయన అమీర్‌పెట్‌లోని ప్రజాశాంతి పార్టీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా తన యాత్ర విరమించుకునేది లేదని తనకు ఎటువంటి హాని జరిగినా అది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజావ్యతిరేక పాలన మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వీరి పాలన పట్ల విసిగి పోయారని ఆరోపించారు.

ఈ నెల 9 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల్లో పాల్ రావాలి.. పాలన మారాలి యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. ఎవరు భయభ్రాంతులకు గురిచేసిన తన యాత్ర ఆపేది లేదని చెప్పారు. సీఎంలు కేసీఆర్, జగన్ తన యాత్రకు అడ్డుపడోద్దన్నారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడు ప్రపంచంలోనే వరెస్ట్ పోలిటీషియన్స్‌లో నంబర్‌వన్ అని, తెలుగు దేశం పార్టీని ప్రజా శాంతి పార్టీ‌లో విలీనం చేయాలన్నారు. గత గురువారం జూన్ 30వ తేదీన ప్రజా శాంతి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా బహిరంగంగా కోరిన విధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ తమ విధిని నిర్వర్తించవలసి ఉంటుందనీ తేల్చి చెప్పారు. అవినీతి రహిత పాలన, ప్రజా సంక్షేమ పాలన కోసం ప్రజలను ప్రజాశాంతి పార్టీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed