Acid Attack: కోడి కూర తెచ్చిన కొట్లాట.. యాసిడ్‌తో దాడి

by S Gopi |   ( Updated:2022-04-01 08:05:38.0  )
Acid Attack: కోడి కూర తెచ్చిన కొట్లాట.. యాసిడ్‌తో దాడి
X

దిశ, వేములవాడ: వేములవాడ పట్టణంలో విలీనమైన తిప్పపూర్ గ్రామంలోని ఓ చికెన్ సెంటర్ లో అదే గ్రామానికి చెందినవారు చికెన్ కొనుగోలు చేసి వండుకున్న అనంతరం చికెన్ వాసన వస్తున్నదని గొడవకు రాగా అక్కడే ఉన్న తిప్పపూర్ మాజీ సర్పంచ్ దుర్గం పర్శరాములు గౌడ్ అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన చికెన్ వినియోగదారుడు మరికొంత మందితో కలిసి మాజీ సర్పంచ్ పర్శరాములును చితకబాదారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ పర్శరాములు వర్గీయలు ఎదురుదాడికి దిగడంతో మరో వర్గీయలు బకీట్లతో యాసిడ్ చల్లుతూ కర్రలతో మాజీ సర్పంచ్ పర్శరాములు వర్గీయులను చితకబాదారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story