దేశంలో ఆల్‌టైమ్ గరిష్ఠానికి విమాన ఇంధన ధరలు!

by Disha Desk |
దేశంలో ఆల్‌టైమ్ గరిష్ఠానికి విమాన ఇంధన ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో దేశీయంగా విమాన ఇంధన(ఏటీఎఫ్) ధరలను 3.3 శాతం పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం వెల్లడించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఏటీఎఫ్ ధరలు ఐదోసారి పెంచడం ద్వారా భారత్‌లో వీటి ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. అయితే, దేశంలోని కీలక రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేయకపోవడం విశేషం. ప్రభుత్వ ఇంధన రిటైలర్ల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు రూ. 93,531కి చేరుకుంది. సాధారణంగా విమానయాన సంస్థలకు అయ్యే ఖర్చులో 40 శాతం ఇంధానానికే అవుతాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ఏటీఎఫ్ ధరలు 26 శాతానికి పైగా పెరిగాయి. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న విమానయాన పరిశ్రమకు ఇది మరింత గడ్డుకాలం. గత వారం నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కారణంగానే గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు రికార్డు స్థాయి 105 డాలర్లకు చేరుకున్నాయి.

Next Story

Most Viewed