కొత్తపేటలో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ఎదుట ఆర్మీ అభ్యర్థుల నిరసన

by Disha Web Desk 2 |
కొత్తపేటలో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ఎదుట ఆర్మీ అభ్యర్థుల నిరసన
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా కొత్తపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆర్మీ అభ్యర్థులు భారీ ధర్నా నిర్వహిస్తున్నారు. ముందుగా శనివారం ఉదయం రైల్వే స్టేషన్ వైపు దూసుకొచ్చిన ఆర్మీ అభ్యర్థులను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కొత్తపేట స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అభ్యర్థులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో రిక్రూట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు రైళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందగా, పదిహేను మందికి గాయాలయ్యాయి. దీంతో ఇవాళ (జూన్18)న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు ఈ పథకాన్ని దేశం వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఇవాళ్టి బంద్‌కు బీజేపీయేతర పార్టీలు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది.


Next Story

Most Viewed