శంఖం పూల మొక్కను ఇంట్లో పెంచుతున్నారా.. కలిగే లాభ నష్టాలివే?

by Anjali |
శంఖం పూల మొక్కను ఇంట్లో పెంచుతున్నారా.. కలిగే లాభ నష్టాలివే?
X

దిశ, వెబ్‌డెస్క్: శంఖం పూలు (conch flower plant) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శంఖం పూలను ఆయుర్వేదంలో రకరకాల వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. శంఖం పూల ప్రయోజనాలు చూసినట్లైతే.. జలుబు(cold), దగ్గు(cough), తలనొప్పి(headache)కి బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తాయి. అంతేకాకుండా శంఖం పూలు మానసిక ఆరోగ్యాన్ని(Mental health) మెరుగుపర్చడంలో మేలు చేస్తాయి.

అలాగే జ్ఞాపకశక్తిని పెంచి(Increase memory), ఏకాగ్రత(Concentration)ను పెంచడంలో తోడ్పడుతాయి. వీటితో పాటు శంఖం పూలు బరువు తగ్గడానికి (lose weight) సహాయపడతాయి. రక్తంలో చక్కెరను సమతుల్యం(Balance blood sugar) చేయడంలో, శంఖం పూలు చర్మం, జుట్టుకు మేలు చేస్తాయి. వృద్ధాప్యాన్ని నివారించడంలో కూడా మేలు చేస్తాయి. శంఖం పూలు కళ్లు, గొంతులో సమస్యలను నివారిస్తాయి.

అలాగే ఈ పూలు మహిళలకు గర్భ సంబంధిత రోగాల(Pregnancy related diseases)ను నయం చేయడంలో శంఖం పువ్వులు సూపర్‌గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతాన లేమి(childlessness), యూరినల్ ఇన్ఫెక్షన్ల(Urinary infections)ను దూరం చేసుకోవాలంటే శంఖం పువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ పూల చెట్లను ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా మంది ఈ మొక్కను బాల్కానీలో పెడుతుండటం చూస్తూనే ఉంటాం. ఇది ఏ రకం వాతావరణంలో అయినా ఈజీగా పెరుగుతుంది. ఎక్కువగా వాటర్ కూడా పోయనవసరం లేదు.

కానీ ఈ శంఖం పూల మొక్కతో ఓ సమస్య ఉందని నిపుణులు అంటున్నారు. అపరాజిత మొక్కను నాటి.. పట్టించుకోకుండా ఉంటే మిగతా మొక్కలకు ప్రమాదమట. దీని వేర్లు చాలా స్పీడ్ గా వ్యాపించి, చుట్టూ పక్కన మొక్కలను కప్పేస్తాయట. కాగా పక్కన మొక్కలు ఎదగకుండా అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. కాగా ఈ మొక్కపై జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.

Next Story