ఈ పండ్లను కలిపి తింటున్నారా.. అయితే వ్యాధుల బారిన పడినట్టే..

by Disha Web |
ఈ పండ్లను కలిపి తింటున్నారా.. అయితే వ్యాధుల బారిన పడినట్టే..
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా శరీరానికి పోషకాలను అందించడంలో ఫ్రూట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఫ్రూట్స్‌లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఫ్రూట్స్ తింటే గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటీస్ వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. అందుకే సీజన్‌లో వచ్చే పండ్లు తినాలని వైద్యులు సూచిస్తారు. కానీ, మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పండ్లను ఎలా తినాలి, ఎప్పుడు తినాలి అనేది తెలియదు. కొన్ని కొన్ని పండ్లను కలిపి తింటుంటారు. అది చాలా ప్రమాదకరమని, ఆరోగ్య సమస్యల వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఏ ఆహారం తినాలన్నా, తాగాలన్నా కొన్ని నియమాలు ఉంటాయని, అవి ఫాలో అయితేనే శరీరానికి మంచి పోషకాలు అందుతాయని చేస్తున్నారు. అయితే ఏయే పండ్లు కాంబినేషన్ మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటి పండు, జామ కాయ: ఇవి సీజనల్ ఫ్రూట్స్ అయినప్పటికీ.. మార్కెట్‌లో ఎక్కువగా దొరుకుతాయి. ఈ రెండు ఫ్రూట్స్ విడివిడిగా తింటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే, ఫ్రూట్ సలాడ్‌లో జామ పండు, అరటి మిక్స్ చేయడం కామన్. కానీ, ఈ కాంబినేషన్‌లో తినడం వల్ల వికారం, తలనొప్పి, కడుపు ఉబ్బరం లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని డా.శిఖా అగర్వాల్ అంటున్నారు.

పుచ్చకాయ, వాటర్: పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల వేసవిలో బాడీని డీహైడ్రాయిడ్ కాకుండా కాపాడుతుంది. అయితే, పుచ్చకాయ తిన్నాక వాటర్ తాగడం మంచిది కాదట. అలా తాగితే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, జీర్ణ ప్రక్రియ మందగించడం లాంటి సమస్యలు వస్తాయి.

బొప్పాయి, నిమ్మ: బొప్పాయి సలాడ్‌లో నిమ్మకాయను పిండుకొని తినకూడదని డా.శిఖా అగర్వాల్ సూచించారు. అలా చేస్తే ఈ రెండు విషంగా మారే అవకాశం ఉందని ఆమె తెలిపారు. అంతేకాకుండా హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయని, రక్త అసమతుల్యత ఏర్పడుతుందని తెలిపారు.

పైనాపిల్, పాలు: జ్యూస్ అనగానే ఉపయోగించే లిక్విడ్ పాలు. అలాగే పైనాపిల్ జ్యూస్‌లో కూడా చాలామంది పాలు వేస్తారు. అయితే ఈ కాంబినేషన్ వల్ల కొంత మందికి కడుపు నొప్పి, వికారం, కడుపు ఉబ్బరం వంటివి వచ్చే అవకాశం ఉందని డా.శిఖా అగర్వాల్ పేర్కొన్నారు. పైనాసిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే కాంపౌండ్.. పాలతో రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావం సెన్సిటివ్‌గా ఉండే వ్యక్తుల ఆరోగ్యంపై పడే అవకాశం ఉంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed