ఇక వేములవాడ వంతు.. రాజన్నను దర్శించుకున్న ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి

by Disha Web Desk 19 |
ఇక వేములవాడ వంతు.. రాజన్నను దర్శించుకున్న ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించిన విషయం తెలిసిందే. దాదాపు. 1200 కోట్లతో ఐదేళ్లలోనే గుడి నిర్మాణాన్ని పూర్తి చేసి కొన్ని రోజుల క్రితం భక్తులకు అంకితం చేశారు. అయితే, యాదాద్రి ఆలయం అత్యంత వైభవంగా రూపొందిన నేపథ్యంలో తర్వాత ఏ ఆలయాన్ని అభివృద్ధి చేస్తారన్న దానిపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో యాదాద్రి అర్కిటెక్ట్ ఆనంద్ సాయి వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి తరహాలోనే వేములవాడ ఆలయాన్ని కూడా అభివృద్ధి చెందే విధంగా సీఎం కేసీఆర్‌తో చర్చించి.. త్వరలోనే ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్.. రాజన్న ఆలయం గురించి కూడా కొన్ని సార్లు మాట్లాడారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌తో కలిసి వేములవాడకు వచ్చే ముందు ఒకసారి ఆలయాన్ని పరిశీలించాలని వచ్చినట్లు చెప్పారు.

Next Story

Most Viewed