- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను రెండో విడత దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను రెండో విడత దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ నెల 11న ఉదయం 6 గంటలకు కళాశాలకు చేరుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, అభ్యర్థి కనీసం ఎత్తు 152 సెంటీమీటర్లు కంటే ఎక్కువగా ఉండాలని, ఎలాంటి కంటి దోషాలు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండకూడదని తెలిపారు. ఈ నెల 11 న ఎంపిక పోటీలు నిర్వహిస్తామని, ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష, వైద్య పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ప్రవేశ ప్రక్రియలో భాగంగా శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారని, అభ్యర్థులు దానికి అనుకూలంగా ఉండేలా ట్రాక్ ప్యాంటు, టీ-షర్ట్, షూస్ ధరించి రావాలని సూచించారు. అదే విధంగా అన్ని రకాల ఒరిజినల్ విద్యా సర్టిఫికెట్లను తప్పనిసరిగా తమ వెంట తీసుకురావాలని స్పష్టం చేశారు.






