ఆపిల్ సరికొత్త లాక్‌డౌన్ మోడ్.. దీని వల్ల లాభం ఇదే..

by Dishafeatures2 |
ఆపిల్ సరికొత్త లాక్‌డౌన్ మోడ్.. దీని వల్ల లాభం ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపిల్ ప్రొడక్ట్స్ కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగానే సంస్థ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లను రిలీజ్ చేస్తోంది. ఇదే తరహాలో ఆపిల్ తన వినియోగదారుల సెక్యూరిటీ కోసం 'లాక్‌డౌన్ మోడ్' అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ IOS 16, iPadOS 16, macOS వెంచురాతో రానుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులకు పూర్తి స్థాయి డిజిటల్ సెక్యూరిటీని అందిస్తుందని సంస్థ తెలిపింది. 'డిజిటల్ భద్రతకు తీవ్రమైన, టార్గెట్ చేయబడి బెదిరింపులు అందుకుంటున్న వినియోగ దారులకు ఈ ఫీచర్ పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ ఫ్యూచర్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అత్యంత అధునాతన డిజిటల్ బెదిరింపుల నుంచి కూడా యూజర్లను కాపాడటంలో ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రయోజిత మెర్సెనరీ స్పైవేర్ వంటి వాటి నుంచి కూడా వినియోగదారులను రక్షించడంలో సహాయపడుతుంది' అని ఆపిల్ సంస్థ పేర్కొంది. వీటితో పాటు ఈ ఒక్క ఫ్యూచర్ వినియోగదారుల డిజిటల్ సెక్యూరిటీ మరో స్థాయికి తీసుకెళ్తుందని, యూజర్ల సెక్యూరిటీ మరింత పెరుగుతుందని సంస్థ చెప్పుకొచ్చింది.


Next Story

Most Viewed