- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
భారత ఫ్యాక్టరీల నుంచే ఐఫోన్ 14 సరఫరా!

న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన రాబోయే ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌ను చైనాతో పాటు భారత్‌లోని ఫ్యాక్టరీల నుంచి ఒకేసారి షిప్మెంట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పస్తుతం ఐఫోన్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ భారత్‌లో కొత్త ఐఫోన్ 14 నుంచి ఈ ఏడాది ద్వితీయార్థంలో మొదటిసారిగా చైనాతో పాటు ఏకకాలంలో సరఫరా చేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. భారత్ నుంచే 25 శాతం ఉత్పత్తి మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో భారత మార్కెట్ ఐఫోన్ తయారీ సామార్థ్యం చైనాకు సమానంగా ఉండనుంది. ఇది యాపిల్‌కు తన ఐఫోన్ ఉత్పత్తిలో చైనా తర్వాత మరో కేంద్రాన్ని కలిగి ఉండటం ముఖ్యమైన మైలురాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయంగా సరఫరా సమస్యలను అధిగమించేందుకు యాపిల్ ప్రయత్నిస్తోందని, భారత్‌ను తదుపరి కీలక మార్కెట్‌గా భావిస్తోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల యాపిల్ సంస్థ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశీయంగా 12 లక్షలకు పైగా ఐఫోన్లను విక్రయించినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది గత ఏడాది కంటే ఏకంగా 94 శాతం వృద్ధి కావడం విశేషం. కంపెనీ సరఫరా చేసిన మొత్తం ఐఫోన్లలో దాదాపు పది లక్షల యూనిట్లు మేక్ ఇన్ ఇండియా కావడం గమనార్హం. ఇక, ఐప్యాడ్ల విక్రయాల్లో సైతం కంపెనీ 34 శాతం వృద్ధిని సాధించింది. స్థానిక తయారీ ద్వారా భారతీయ వినియోగదారులకు మరింత చేరువ కావాలని కంపెనీ లక్ష్యంగా ఉంది.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.