ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మొదటి 10,000 మందికి స్పెషల్ ఆఫర్

by Disha Web |
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మొదటి 10,000 మందికి స్పెషల్ ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్: రాజధానిలో వాయు కాలుష్యం గణనీయంగా పెరుగుతోంది. అయితే తాజాగా ఢిల్లీలో కొత్త(స్కూటర్లు, మోటార్ సైకిళ్లు) వాహనాల రిజిస్ట్రేషన్లు భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో పోల్యూషన్ తగ్గించడంలో సహాయపడటానికి ఎలక్ట్రిక్ మోడ్‌కు మారడం చాలా ముఖ్యమని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం తన ఉద్యోగులకు సులభమైన మార్గం కనుగొన్నది. నెలవారీ వాయిదాలలో ఇ-టూ-వీలర్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తోందని అధికారులు శుక్రవారం తెలిపారు. అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం గురువారం ఒక ప్రణాళికను ప్రకటించింది. దీని ప్రకారం మొదటి 10,000 ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలుదారులు రూ. 5,500 వరకు కొనుగోలు ప్రోత్సాహకాన్ని పొందుతారు. అయితే మొదటి 1,000 మందికి మాత్రం రూ. 2,000 అదనపు ప్రోత్సాహం లభించనుంది.

అధికారిక అంచనాల ప్రకారం, ఢిల్లీ ప్రభుత్వంలో రెండు లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులు తమ డిపార్ట్‌మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించనున్నారు. అంతేకాకుండా ముందస్తుగా చెల్లించే అవకాశం కూడా వారికి ఉంటుంది.

Next Story

Most Viewed