- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
జగన్‌తోనే అభివృద్ధి సాద్యం: గుడివాడ అమర్‌నాథ్
by Disha Web |

X
దిశ, డైనమిక్ బ్యూరో : పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందువరుసలో ఉంచుతామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. తిరుపతిలోని సన్నీ ఆప్కో టెక్ ప్రైవేట్ లిమిటేడ్ సంస్థ ప్రారంభోత్సవం సీఎంతో కలిసి పాల్గొన్నా ఆయన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడులు, 20 వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలకు సీఎం జగన్ నాంది పలికారని చెప్పారు. కొన్ని కంపెనీల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు గురువారం జరిగాయని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. కంపెనీలకు ఏ రకమైన సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సీఎం ఆలోచనలకు అనుగణంగా పని చేస్తామని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు.
Next Story