- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్‌స్టాగ్రామ్ లో మరో కొత్త ఫీచర్
ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. యూజర్స్ వారి ప్రొఫైల్ లో ఉన్న తమకు ఇష్టమైన పోస్టులను నచ్చినట్టు రీ-ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. గతంలో ప్రొఫైల్ గ్రిడ్‌లోని పోస్టులు, రీల్స్‌ను పిన్ చేసినప్పుడు మాత్రమే టాప్ లో ఉంచుకునే అవకాశం ఉండగా.. తాజా అప్‌డేట్ ద్వారా యూజర్లు తమ ప్రొఫైల్ గ్రిడ్‌లోని పాత పోస్టులను కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ నచ్చిన క్రమంలో అమర్చుకునే 'Reorder Your Grid' సదుపాయాన్ని ఇన్‌స్టాగ్రామ్ అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ఇకపోతే స్టోరీ హైలైట్స్‌ను నేరుగా రీ-ఆర్డర్ చేసే అఫీషియల్ ఆప్షన్ ప్రస్తుతం యాప్‌లో లేదు. వీటితో పాటు సేవ్ చేసిన కలెక్షన్లు, క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ లలో కూడా నచ్చిన విధంగా రీ-ఆర్డర్ చేసుకునే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ కొత్త గ్రిడ్ రీ-ఆర్డర్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.






