ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి..

by Disha Web |
ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతి రోజూ ఏదో ఒక వింత జరుగుతూనే ఉంది. ఇటీవల వింత వింత సముద్ర జీవులు ఒడ్డుకు కొట్టుకొస్తున్న సన్నివేశాలు పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యూఎస్‌లోని ఒరెగాన్ బీచ్‌ ఒడ్డుకు మరో వింత సముద్ర జీవి మృతదేహం కొట్టుకొచ్చింది. దీనికి సంబందించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాకుండా తాను ఎన్నడూ ఇలాంటి చేపలను చూడలేదంటూ ఫొటో కింద రాసుకొచ్చారు. అది సూదుల్లాంటి పళ్లతో ఉంది. దాంతో పాటుగా అది చనిపోయి ఉండటంతో, ఆ చేప కొన్ని అవయవాలు డీకంపోజ్ అయిపోయి ఉన్నాయి. అయితే దీనిపై స్పందించిన మెరిన్ బయాలజిస్టులు మాత్రం ఈ జీవి విషయంలో తమ అంచనాలను షేర్ చేస్తున్నారు. ఇది బహుశా మంకీఫేస్‌డ్ ప్రికిల్‌బ్యాక్ లేదా మంకీఫేస్ ఈల్ అయిఉండొచ్చని అంటున్నారు.

Next Story