నానో టెక్నాలజీతో భవిష్యత్‌లో ఎన్నో ఉపయోగాలు

by Disha Web Desk 13 |
నానో టెక్నాలజీతో భవిష్యత్‌లో ఎన్నో ఉపయోగాలు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: నానో టెక్నాలజీతో భవిష్యత్లో వైద్యం, సేవ రంగాలతో పాటు మనిషి సంబంధించిన అన్ని అంశాల్లోనూ విస్తృత ప్రయోజనాలున్నాయని ఆంధ్రా యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ ఈయూబీ రెడ్డి చెప్పారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని మాజీ మంత్రి తక్కళ్ళపల్లి పురుషోత్తమరావు నివాసంలో ఆన్లైన్ జూమ్ సదస్సు జరిగింది. తెలంగాణ జనవేదిక వ్యవస్థాపక కన్వీనర్ తక్కళ్ళపల్లి రామ నేతృత్వంలో నానో టెక్నాలజీ ఉపయోగాలు- నష్టాలు అన్న అంశంపై జరిగిన సదస్సులో ప్రొఫెసర్ ఈయూబీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేశారు .

నేడు ప్రపంచం సుస్థిరాభివృద్ధి , ప్రకృతి వనరుల ప్రాధాన్యతపై చర్చిస్తోందని దీనికి నానో టెక్నాలజీ ఎంతో దోహదపడుతోందని చెప్పారు. ప్రకృతి వనరులను పొదుపు చేసేందుకు నానో టెక్నాలజీ కీలకమన్నారు. నానో టెక్నాలజీ చీప్ వచ్చాయని, ప్రకృతిలోని వివిధ రకాల కాలుష్యాలను ఎదుర్కొనేందుకు నానో టెక్నాలజీ ప్రధానమన్నారు. ప్రకృతి విపతులను నివారించేందుకు నానో టెక్నాలజీ ప్రధామని చెప్పారు. నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయని, ఉప్పునీటిని తాగునీటిగా మార్చేది నానో టెక్నాలజీయేని చెప్పారు. నానో టెక్నాలజీ దుస్తులతో దుస్తులను ఉతకడం, ఇస్త్రీ చేయడం లాంటి పనులు పోతాయని చెప్పారు. దీంతో నీరు, విద్యుత్ ఆదా అవుతోందని చెప్పారు.

లిథియం బ్యాటరీల స్థానంలో నానో బ్యాటరీలు వస్తున్నాయని, నానోటెక్నాలజీలో గ్లాసులు రాబోతున్నాయని చెప్పారు. ఆటోమొబైల్ రంగంలోనూ పెద్ద ఎత్తున మార్పుల రానున్నాయని చెప్పారు. క్యాన్సర్ వ్యాధి నివారణకు టెక్నాలజీ ఉపయోగడుతోందని చెప్పారు. నానా టెక్నాలజీతో నష్టాలు కూడా ఉన్నాయని వివరించారు. తెలంగాణ జన వేదిక వ్యవస్థాపక కన్వీనర్ తక్కళ్ళపల్లి రాము మాట్లాడుతూ.. నానో టెక్నాలజీ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని చెప్పారు. టెక్నాలజీ ఉపయోగించుకుని వృద్ధి చెందే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సదస్సుకు సంయోజకులుగా డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ వ్యవహరించగా బజార్ రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed