ఆర్థిక సమస్యలే పోర్న్‌స్టార్‌ను చేశాయి.. చార్లెట్ కేసును ఛేదించిన పోలీసులు

by Dishafeatures2 |
ఆర్థిక సమస్యలే పోర్న్‌స్టార్‌ను చేశాయి.. చార్లెట్ కేసును ఛేదించిన పోలీసులు
X

దిశ, సినిమా : ప్రముఖ శృంగార తార 'చార్లెట్ ఏంజీ' ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు బ్యాంకింగ్ ఆఫీసర్‌ 'డేవిడ్ ఫోంటానా'ను హంతకుడిగా నిర్ధారించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ వివరాలను మీడియాకు వెల్లడిస్తూ.. 'అతను జనవరిలోనే షార్లెట్‌ను సుత్తితో కొట్టి హత్య చేశాడు. అప్పటి నుంచి శవాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టిన డేవిడ్ ఇటీవలే ముక్కలుగా నరికి గ్రామానికి సమీపాన గల చెత్తకుండీలో పడేశాడు. అయితే విచారణలో భాగంగా ఈ విషయాలన్నింటీనీ డేవిడ్ స్వయంగా అంగీకరించాడు' అని పేర్కొన్నారు. కాగా ఓ ప్రముఖ ఫెర్ఫ్యూమ్ షాప్‌లో సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేసే చార్లెట్.. కొవిడ్ కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తడం, కనీస అవసరాలు తీర్చుకోలేక బతకడమే కష్టమవడంతో అశ్లీల చిత్రాల్లో నటిస్తూ పాపులారిటీ పెంచుకుందని పోలీసులు చెప్పారు. అలాగే డేవిడ్ ఇంటికి ఓ అందమైన యువతి ఎప్పుడూ వస్తూ పోతుండేదని ఇరుగుపొరుగు చెప్పడంతో అసలు బండారం బయటపడిందని వెల్లడించారు.


Next Story