ఆలయ అక్రమాలపై విచారణ చేపట్టాలి..

by Dishafeatures2 |
ఆలయ అక్రమాలపై విచారణ చేపట్టాలి..
X

దిశ, చేర్యాల: కొమురవేల్లి ఆలయంలో అవినీతి అక్రమాలు జరిగాయని వీటిపై దేవదాయ శాఖ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలని. సిద్దిపేట జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ అన్నారు. చేర్యాల మండల కేంద్రంలో జరిగిన బీజేవైఎం మండల అధ్యక్షుడు మాచర్ల ప్రవీణ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. కొమురవేల్లి ఆలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, ఒగ్గు పూజారుల నియామకం, దేవాలయంలో పూజారుల నియామకం పట్ల, దేవాలయం ముందు ఉన్న గృహ సముదాయాల తొలగింపు, భూమికి బదులుగా భూమి, అదనంగా నగదు ఇవ్వడం, పలు అక్రమాలకు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. కొమురవేల్లి మల్లికార్జున స్వామి ఆలయ మాజీ చైర్మన్ గిస బిక్షపతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు.

గుడి ముందు తోపుడుబండ్లతో వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారుల నుండి కూడా నగదు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇంతటి నీచమైన చర్యలకు పాల్పడటం విచారకరమని ఆయన విమర్శించారు. ఈ అక్రమాలపై దేవాదాయ శాఖ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి గిస భిక్షపతిపై తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మాచర్ల ప్రవీణ్, కొయ్యడ నవీన్, కాశెట్టి రాకేశ్, మనోజ్, బొకురి నరేష్ రెడ్డి, సల్ల అజయ్, పొన్నబోయిన అనిల్, లక్ష్మీపతి, నవీన్, కొలిపాక రాజశేఖర్, అజయ్, బీజేవైయం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed